కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యురేనియం తవ్వకాలను జరగనివ్వబోమని అఖిలపక్షం హెచ్చరించింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఓబులంపల్లెలో బహిరంగ సభ నిర్వహించారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు అన్నారు. పంటలు పండకపోగా, తీవ్ర అనారోగ్యానికి గురై దుర్భర జీవితాలను గడుపుతున్నారని వివరించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలకు రక్షణలేదని మాజీ మంత్రి అఖిలప్రియ వెల్లడించారు. ఆళ్లగడ్డ మండలంలో యురేనియం తవ్వకాలను అడ్డుకున్నామని అన్నారు. 3 వేల టన్నుల మట్టి తీస్తే కిలో యురేనియం మాత్రమే వస్తుందని... ఈ తవ్వకాలపై పార్టీలకు అతీతంగా పోరాడాలని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాలవ శ్రీనివాసులు, అఖిలప్రియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
"యురేనియం తవ్వకాలను ప్రభుత్వం నిలిపివేయాలి''
కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యురేనియం తవ్వకాలను జరగనివ్వబోమని అఖిలపక్షం హెచ్చరించింది. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఓబులంపల్లెలో బహిరంగ సభ నిర్వహించారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారం కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు అన్నారు. పంటలు పండకపోగా, తీవ్ర అనారోగ్యానికి గురై దుర్భర జీవితాలను గడుపుతున్నారని వివరించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ప్రజలకు రక్షణలేదని మాజీ మంత్రి అఖిలప్రియ వెల్లడించారు. ఆళ్లగడ్డ మండలంలో యురేనియం తవ్వకాలను అడ్డుకున్నామని అన్నారు. 3 వేల టన్నుల మట్టి తీస్తే కిలో యురేనియం మాత్రమే వస్తుందని... ఈ తవ్వకాలపై పార్టీలకు అతీతంగా పోరాడాలని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాలవ శ్రీనివాసులు, అఖిలప్రియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Body:యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష పార్టీల పర్యటన
Conclusion:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లె లో అఖిలపక్ష పార్టీల పర్యటన