కర్నూలు జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక సూత్రధారి మాదాల శ్రీనుని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయడానికి 50 లక్షల రూపాయల సుఫారీ కుదుర్చుకున్న కేసులో గుంటూరు జిల్లాకు చెందిన మాదాల శ్రీనివాసులు కీలకమైన వ్యక్తి అని కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సుబ్బారెడ్డిని హత్య చేయడానికి సుఫారీ కుదుర్చుకున్న వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఇతనే చూసేవాడని తెలిపారు. ఇదే కేసులో మార్చి 21న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు.
ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసులో మరో వ్యక్తి అరెస్ట్ - crime news kurnool district
తెదేపా సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక సూత్రధారిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో అసలు సూత్రధారులు ఎవరనేది త్వరలోనే తేలుస్తామని డీఎస్పీ తెలిపారు.
కర్నూలు జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక సూత్రధారి మాదాల శ్రీనుని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయడానికి 50 లక్షల రూపాయల సుఫారీ కుదుర్చుకున్న కేసులో గుంటూరు జిల్లాకు చెందిన మాదాల శ్రీనివాసులు కీలకమైన వ్యక్తి అని కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. సుబ్బారెడ్డిని హత్య చేయడానికి సుఫారీ కుదుర్చుకున్న వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఇతనే చూసేవాడని తెలిపారు. ఇదే కేసులో మార్చి 21న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు.
ఇదీ చూడండి:కరోనాపై పోరు... కుంచే ఆయుధం