ETV Bharat / state

అనిశా వలలో ఎంవీఐ ఏజెంట్లు.. - ANISHA MEANING

మోటార్​ వెహికల్ ఇన్​స్పెక్టర్ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యలయంలో అధికారుల అండతో ఏజెంట్లు చేస్తున్న వసూళ్ల అక్రమాలను బట్టబయలు చేసి ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అనిశా వలలో ఎంపీఐ ఏజెంట్లు
author img

By

Published : Sep 14, 2019, 1:41 PM IST

Updated : Sep 14, 2019, 2:02 PM IST

అనిశా వలలో ఎంవీఐ ఏజెంట్లు..

కర్నూలు జిల్లా డోన్​లో మోటారు వాహనముల తనిఖీ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వాహనదారుల నుంచి చలాన కంటే అధిక డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేశామని డీఎస్పీ నాగభూషణం తెలిపారు. దాడుల్లో ఏజెంట్లైన రామచంద్రమోహన్, అన్వర్​బాషా,అక్బర్ అనే ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల నుంచి 40 వేల 20 రూపాయలు నగదు, రెండు సెల్ ఫోన్​లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని మధ్యవర్తులుగా ఉపయోగించుకుని ఎంవీఐ శివశంకర్​ రెడ్డి డ్రైవింగ్ లైసెన్సు, ఎల్​ఎల్​ఆర్​, ఇతర ధ్రువపత్రాలకు సంబంధించిన పనులు త్వరితగతిన చేస్తామంటూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలనే నివేదికలో పొందుపరచి పై అధికారులకు పంపిస్తామన్నారు. ఎల్ఎల్​ఆర్ పత్రాలు, ఒరిజినల్ డాక్యుమెంట్లను ఏజెంట్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే ప్రజలు వెంటనే తెలియచేయాలన్నారు. వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి:

వసతిగృహం వీడిన విద్యార్థుల ఆచూకీ లభ్యం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
Ap_Atp_46_14_ Kshudra_Pujalu _AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరి మండలం సోమేశ్ నగర్ లో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపింది. కాలనీలోని ఓ ఇంటి ముందు పసుపు కుంకుమ, దిష్టిబొమ్మ, కోడి కాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వదిలి వెళ్లారు.
తెల్లవారుజామున దీన్ని గుర్తించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సోమేశ్ నగర్ కు చేరుకుని వాటిని తొలగించారు. స్థానికుల ల ఇచ్చిన సమాచారం మేరకు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని పోలీసులు అన్నారు.Conclusion:
Last Updated : Sep 14, 2019, 2:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.