ప్రముఖ శైవ క్షేత్రము కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవికి దాతలు వెండి దీపాలను బహుకరించారు. కార్తిక సోమవార పర్వదినాన్ని పురస్కరించుకొని మహానంది ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ వెంకట రాముడు-కృష్ణవేణి దంపతులు, రామచంద్రుడు-శ్రీదేవి దంపతులు వీటిని అందించారు. 1.60 కిలోల బరువుతో లక్షా నలభై వేల రూపాయల విలువైన ఈ దీపాలను నిత్యదీపారాధనకు ఉపయోగించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండీ...అనంత పద్మనాభస్వామి గుడిలో దుండగుల దుశ్చర్య