యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ రాష్ట్రపతికి ఏఐవైఎఫ్ లేఖ కడప జిల్లా తుమ్మలపల్లిలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలు రాశారు. వీటిని కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని పోస్ట్ బాక్సులో వేశారు. యురేనియం ప్లాంట్ వల్ల గాలి, నీరు, కలుషితమై ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తమ లేఖల్లో పేర్కొన్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారని వాపోయారు. వెంటనే ప్లాంట్ రద్దు చేయాలని కోరారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వకూడదని లేఖలో విజ్ఞప్తి చేశారు.ఇదీ చూడండి:
తుమ్మలపల్లి యురేనియం బాధితుల సమస్య తీరేనా..?