కర్నూలులో ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యురేనియం తవ్వకాలపై అవగాహన కల్పించారు. కళాశాలలోని విద్యార్థులు యురేనియం మైనింగ్‌తో లాభం కన్న నష్టమే ఎక్కువగా ఉందని విద్యార్థులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం మైనింగ్‌ను నిలిపివేయాలని ఏఐడీఎస్ఓ నాయకురాలు లలిత కోరారు.
ఇదీ చూడండి: 'యురేనియంపై పోరాటానికి ముందుకురండి'