Rahul Gandhi Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలో నాలుగు రోజుల పాటు భారత్ జోడో యాత్ర సాగింది. నాలుగో రోజు మంత్రాలయం నుంచి కర్ణాటక రాష్టంలోకి ప్రవేశించింది. యాత్రలో భాగంగా హాలహర్వి-చిలకలడోన మధ్య .. పత్తిపొలాల్లోకి వెళ్లిన రాహుల్ రైతులతో మాట్లాడారు. అధిక వర్షాలు, నాసిరకం విత్తనాలతో నష్టపోయామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
విరామ సమయంలోవివిధ సమస్యలపై ప్రజా సంఘాల నాయకులు వేర్వేరుగా రాహుల్ గాంధీని కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కార్మిక సంఘాలు, పంచాయతీల నిధుల విషయమై సర్పంచ్‌లు, ప్రత్యేకహోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని పలువురు మేధావులు, ఎల్ఐసీని కాపాడాలని ఆ సంస్థ ఉద్యోగులు, ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ నాయకులు కలిశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే...విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వం రంగంలోనే కొనసాగేలా చూస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన పరిశ్రమను ప్రైవేటుపరం కానివ్వబోమని స్పష్టం చేశారు.
పాదయాత్ర అనంతరం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని రాహుల్ గాందీ దర్శించుకున్నారు. రాత్రి మంత్రాలయం మండలం చెట్నేహళ్లిలో బస చేశారు. నాలుగో రోజు మంత్రాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై కర్ణాటక రాయచూరు జిల్లాలోకి ప్రవేశించింది.
ఇవీ చదవండి: