కర్నూలు జిల్లాలో.. లక్ష్మీ నరసింహ స్వామి వెలసిన అహోబిల క్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబంరంగా జరిగాయి. సీతారామ, లక్ష్మణ ఉత్సవ మూర్తులకు నవ కలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి మంగళ హారతులు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిమితంగా భక్తుల నడుమ ఈ ఉత్సవాలను పూర్తి చేశారు.
ఇవీ చూడండి: