Action on police: కర్నూలు జిల్లా మద్దికెరలో రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని.. వదిలేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు పై కేసు నమోదైంది. రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు వెళ్లి వాహనాన్ని పట్టుకున్నారు. అనంతరం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఫోన్ చేసి బెదిరించడంతో వాహనాన్ని వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఈ విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు.
ఇవీ చూడండి: