ఒకే ఒక్కడు.. కార్లు, ఆటోలు దొంగిలించడంతోపాటుగా.. ఇళ్లలోనూ ఎవరి సహాయం లేకుండా దొంగతనాలకు పాల్పడటం కర్నూలు పోలీసులకు ఆశ్చర్యానికి గురిచేసింది. కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన షేక్ రఫీ ఇళ్లల్లో దొంగతనాలతోపాటు కార్లు, ఆటోలు దొంగలించేవాడని పోలీసులు తెలిపారు. రఫీ ఒక్కడే దొంగతనాలకు పాల్పడే వాడని... అందుకే ఎవరికీ అనుమానం వచ్చేదికాదని డీఎస్పీ వెంకట రామయ్య వెల్లడించారు. నిందితుడు నుంచి 15 తులాల బంగారం, కారు, ఆటోను స్వాదీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి...