కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో ప్రమాదం జరిగింది. బాయిలర్ యూనిట్‌లో వేడినీళ్లుపడి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వేడి గొట్టం నుంచి వేడి నీరు పడి లక్ష్మణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలవ్వగా.. నంద్యాల ప్రభుత్వఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు.నంద్యాల ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డిఎస్పీ చిదానంద రెడ్డిలు కర్మాగారంలో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఘటనపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆర్డీవో అన్నారు. ప్రమాదంపై విచారణ చేస్తామని డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.
కొన్ని రోజుల క్రితమే పరిశ్రమలో అమోనియమ్ గ్యాస్ లీకై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. అమ్మోనియానికి అనువైన పైపును ఉపయోగించలేదని విచారణ కమిటీ సభ్యులు గుర్తించారు. కాపర్ స్టీల్ పైపు బదులుగా మైల్డ్ స్టీల్ పైపు వాడినట్లు చెప్పారు. అగ్నిప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని కమిటి సభ్యులు ఆరోపించారు.
ఇదీ చదవండి: సీఎం మాట తప్పి మడమ తిప్పారు.. రాజీనామా చేస్తారా..?: చంద్రబాబు