కర్నూలు జిల్లా నంద్యాల మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్న జాకబ్ రాజశేఖర్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు(ACB RAIDS) నిర్వహించారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, కడపల్లో అధికారులు సోదాలు చేశారు.
సోదాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. ఇంజనీరు రాజశేఖర్‌కు రెండు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని ఓపెన్ చేసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి:
సొంత పార్టీ ఎమ్మెల్యేనే అక్రమ కేసు పెట్టారు.. వైకాపా మహిళా నేత ఆవేదన