కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ కమిషనర్ బి.ప్రహ్లాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. స్థానికంగా శ్రీనివాసులు హోటల్ నిర్వహిస్తుండగా.. ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది ఉండటంతో స్థానికుల ఫిర్యాదు మేరకు కమిషనర్ హోటల్‌పై దాడి చేసి సామగ్రి, గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్నాడు. దీంతో బాధితుడు కోర్టులో ఫిర్యాదు చేయగా కమిషనర్ స్పందించలేదు. బాధితుడు మరోసారి కోర్టుకు వెళ్లాడు. అతని సామగ్రిని తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఈ విషయమైన కమిషనర్ హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టులో సమస్య పరిష్కారమైంది. బాధితుడు తన సామగ్రి ఇవ్వాలని కోరగా.. ఆ కేసు విషయంలో తనకు హైకోర్టులో 22 వేల 500 ఖర్చైందని... ఆ డబ్బులు ఇవ్వాలని కమిషనర్ అడిగాడు. తన దగ్గర అంత సొమ్ము లేదని.. పది వేల రూపాయలు ఇస్తానని బాధితుడు అంగీకారం కుదుర్చుకున్నాడు. బాధితుడు శ్రీనివాసులు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కమిషనర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఏసీబీకి కమిషనర్ పట్టుబడటంతో గూడూరులో ప్రజలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమ జీతాలు సైతం కమిషనర్ తీసుకున్నారని పారిశుద్ద్య కార్మికులు ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: