ACB RAIDS: కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో ఇద్దరు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ. 10,360, కార్యాలయం ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ నుంచి రూ. 17,200 స్వాధీనం చేసుకున్నారు.
ఈ సోదాల్లో కార్యాలయంలోని డస్ట్‌బిన్‌లో దాచి ఉంచిన రూ. 18,400 సొమ్మును ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో మెుత్తం రూ. 45,960 అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:
problems in hospital: నిండు చూలాలైనా సరే.. అక్కడ నేల మీద కూర్చోవాల్సిందే!