వీరస్వామి... కర్నూలు జిల్లా ఆదోని పట్టణం క్రాంతినగర్ పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడు. వచ్చేది తక్కువ జీతమే. తనకు వచ్చేదాంట్లో కొంతమేర వానరాల కోసం ఖర్చు చేస్తున్నాడు. వానరాలు అంటే అమితమైన భక్తి, ప్రేమ వీరస్వామికి. ఆకలి తీర్చడం, గాయాలైనప్పుడు చికిత్స చేసి చేరదీయటం వంటివి చేస్తాడు. ఈ క్రమంలో చాలా కోతులను ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా పదుల సంఖ్యలో కోతులు పెంచడం కారణంగా చుట్టుపక్కల వారికి ఇబ్బందుల తలెత్తాయి. ఎవరికీ ఇబ్బంది కలగకుండా పట్టణ శివారులోని కోతికొండల్లో షెడ్ ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నాడు.
రోజుకు రూ.300 వరకు ఖర్చు...
ప్రతిరోజూ కోతుల కోసం 300 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు వీరస్వామి. పట్టణంలో జరిగే వేడుకల్లో ఆహార పదార్థాలు మిగిలితే వృథా కాకుండా తనకి ఫోన్ చేసి చెబుతారని వీరస్వామి వివరించారు. సాటి మనిషి ఆపదలో ఉంటే సాయం చేసేందుకు ముందుకురాని ఈ రోజుల్లో... మూగజీవాలపై పెద్దమనసు చాటుకుంటున్న వీరస్వామిని స్థానికులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి : రాజధాని సంబంధిత పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ