ETV Bharat / state

SHOCK: కరెంట్​ బిల్లు చూసి..కళ్లు బైర్లు కమ్మి

author img

By

Published : Sep 12, 2021, 12:27 PM IST

Updated : Sep 12, 2021, 3:03 PM IST

high electricity bill
high electricity bill

12:24 September 12

రూ.57 వేలు బిల్లు చూసి లబోదిబోమంటున్న బాధితుడు

ఆదోనిలో పంక్చర్ షాపునకు రూ.57 వేల కరెంటు బిల్లు

రాష్ట్రంలో విద్యుత్​ వైర్లను తాకకుండానే..ప్రజలకు షాక్​ తగులుతోంది. గత కొన్ని నెలలుగా విద్యుత్​ సిబ్బంది నిర్వాకంతో బిల్లుల్లో పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు ఒకటి, రెండు కాదు.. ఎన్నో జరుగుతున్నాయి. మరోవైపు ఈ బిల్లులను చూసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మధ్య పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్న హోటల్​కు రూ.21 కోట్ల బిల్లు రాగా.. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది.  

కర్నూలు జిల్లా ఆదోనిలో బసవన్న అనే వ్యక్తి తన ఇంట్లోనే పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. పొట్టకూటి కోసం పని చేసుకుంటున్న బసవన్నకు విద్యుత్ అధికారులు షాకిచ్చారు. ఈనెల విద్యుత్​ బిల్లు ఏకంగా రూ. 57 వేలు రావడంతో.. బసవన్న షాక్ తిన్నాడు. అంత బిల్లు ఎలా కట్టాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

ప్రతి నెలా కరెంటు బిల్లు వంద రూపాయలు వస్తుంది. ఈ సారి మాత్రం 57 వేల రూపాయలు వచ్చింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి విద్యుత్ కార్యాలయానికి వెళ్లాను. వారు అందుబాటులో లేరు. -బసవన్న, బాధితుడు

ఇదీ చదవండి: STUDENT DEAD: గుంతలు తీసి మరిచారు..బాలుడి ప్రాణాలు తీశారు

Last Updated : Sep 12, 2021, 3:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.