కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వస్తోన్న ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థకు చెందిన వాహనాన్ని తనిఖీ చేయగా... అందులో తెలంగాణకు చెందిన 12 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఈ వాహనంలో ఉన్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
కర్నూలు చెందిన మరో వ్యక్తి ద్విచక్రవాహనంపై తెలంగాణకు చెందిన 12 మద్యం సీసాలు తీసుకువస్తుండగా...ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేశామని సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు.
ఇదీ చూడండి: ప్రకృతి అందాలతో అలరారుతోన్న అహోబిలం