పాత పథకానికే పేరు మార్చి తెచ్చిన జగనన్న విద్యా కానుక పిట్టకథలా ఉందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ విద్యార్థులకు అనేక పథకాలు దూరం చేశారని మండిపడ్డారు.
తెదేపా హయాంలోనూ..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా పాఠ్య పుస్తకాలతో పాటు రెండు జతలకు సరిపడా యూనిఫామ్ పంపిణీ చేశామని గుర్తు చేశారు. న్యాయస్థానం చీవాట్లు పెట్టినా కిట్ల రంగుల కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ప్రణవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : మరో 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే