ETV Bharat / state

Ys Sharmila: ఉమ్మడి కరీంనగర్​లో వైఎస్​ షర్మిల పర్యటన..! - వైఎస్​ షర్మిల తెలంగాణ పార్టీ

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల.. ఆ దిశగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని దివంగత వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. జిల్లాలో తొలిసారి సభ జరగనుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Ys Sharmila
ఉమ్మడి కరీంనగర్​లో వైఎస్​ షర్మిల పర్యటన.
author img

By

Published : Jun 24, 2021, 6:30 PM IST

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు వైఎస్‌ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం 7గంటలకు ఆమె లోటస్‌పాండ్‌ నుంచి బయలుదేరి వెళతారని షర్మిల కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఇటీవల కరోనా బారిన పడి మరణించిన పలువురి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అనంతరం చేనేత కార్మికులతో సమావేశమై.. వారి కష్టాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని దివంగత వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

మరికొద్ది రోజుల్లో ప్రజల్లోకి వెళ్లనున్న తమ పార్టీపై భాజపా కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కూకట్‌పల్లి, ఇల్లందు, నాగార్జునసాగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు.. ప్రముఖ ఛానళ్ల లోగోను వాడుకుంటూ పని గట్టుకుని తమపై చెడు ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే వారిని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అవాస్తవాలతో ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారో చూస్తాం.

- ఇందిరా శోభన్, షర్మిల పార్టీ అధికార ప్రతినిధి

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న వైఎస్ షర్మిల.. ఆ దిశగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. జిల్లాలో తొలిసారి సభ జరగనుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:

Viveka Murder Case: వివేకా హత్యకేసు.. సీబీఐ విచారణకు ఫైనాన్స్ ఉద్యోగి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.