వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌కు అమరావతి నిరసన సెగ తగిలింది. సొంత పనిపై కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఆయనకు... టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గులాబీ పూలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. ఎంపీ సురేశ్ మాత్రం తమను బూతులు తిడుతూ ముందుకు సాగారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఒక ఎంపీ అయి ఉండి... అసభ్యకరరీతిలో దూషించడం ఏంటని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీ అంతు చూస్తా' అని తమను హెచ్చరించారని వారు వాపోయారు.
ఇదీ చదవండి
నారావారిపల్లెలో ఉత్కంఠ.. వైకాపా సభకు వ్యతిరేకంగా తెదేపా నిరసన