రాష్ట్రంలో మూతబడిన సహకార డెయిరీలను తిరిగి లాభాల బాటలో నడిపించటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే కిలారు రోశయ్య అన్నారు. అందుకే.. అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు.
రైతుల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీని అడ్డుపెట్టుకుని ధూళిపాళ్ల నరేంద్ర పాడి రైతులను మోసం చేశారని ఆరోపించారు. సొసైటీల్లో రైతులకు లాభాలు చెల్లించకుండా సొమ్మును కాజేశారన్నారు.
ఇదీ చదవండి: