విజయవాడ నగర పాలక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని.. తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఉద్ధృతం చేసింది. తూర్పు నియోజకవర్గం శాసనసభకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో.. ఆ 21 డివిజన్లలో ఎన్నికలను వైకాపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ప్రచారాన్ని ప్రారంభించి.. అభ్యర్థితో పాటు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణలంక రాణీగారి తోటలోని 17వ డివిజన్లో కరపత్రాలు ఇస్తూ.. ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఓ టిఫిన్ సెంటర్ వద్ద గరిటె పట్టుకున్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం: డీజీపీ