అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు ఆరోపించారు. పంచాయతీల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం కేటాయించిన 800 కోట్ల రూపాయలు, 15వ ఆర్థిక సంఘానికి చెందిన 1300 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పంచాయతీల అభివృద్ధి అంటే వాలంటీర్ల అభివృద్ధి అన్నట్లుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బచ్చుల ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయల నరేగా నిధులను వృథా చేసిందని ధ్వజమెత్తారు. ఇళ్ల పట్టాల పేరుతో భూములు చదును కోసం నరేగా నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
ఇదీ చదవండి
తెలుగు పరిణామ క్రమానికి మరో సాక్ష్యం.. అరుదైన శిలా శాసనం లభ్యం