వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా.. కృష్ణా జిల్లా మైలవరంలో పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని.. రానున్న నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: