మాజీ ఎమ్మెల్యే యరపతినేని లైమ్‌స్టోన్ గనులను అక్రమంగా తవ్వారని మాజీ ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ రేపటకి వాయిదా వేసింది. సీఐడీ దర్యాప్తు చేస్తున్న కేసును పిటిషనర్ కోరకుండా సీబీఐకి అప్పగిస్తానని అనడం సరైంది కాదని యరపతినేని తరఫు న్యాయవాది అన్నారు. సీఐడీ ఎప్పటికప్పుడు కేసు నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పిస్తుందని చెప్పారు. సీఐడీ దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదనీ, దర్యాప్తుపై అనుమానాలున్నాయని టీవీజీ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది అన్నారు. ఈ నేపథ్యంలోనే కేసును సీబీఐకి అప్పగించాలని కోరామన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని చెప్పారు.
ఇదీ చదవండి : 'రాజధాని కోసం అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం'