ETV Bharat / state

సీఎం జగన్.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: యనమల - yanamala ramkrishnudu latest news

తెదేపా నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక పాలన అందించటంలో సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై.. గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

yanamala ramakrishnudu
యనమల
author img

By

Published : Jan 25, 2021, 10:34 AM IST

ఎన్నికల్లో అధికార యంత్రాంగం పాల్గొనకుండా చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాజ్యాంగ సంక్షోభంతో.. రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గవర్నర్ తనకున్న అధికారాలతో జరుగుతున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని బిశ్వభూషణ్​ను కోరారు.

సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామంటున్న ప్రభుత్వం.. హైకోర్టు తీర్పును గౌరవించాలని హితవు పలికారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తామని చేసిన ప్రమాణాన్ని ఉద్యోగులు, అధికారులు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదని, అధికార యంత్రాగమే శాశ్వతమని వారు గ్రహించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక విధుల్లో పాల్గొననటం దేశ చరిత్రలో లేదని విమర్శించారు. స్థానిక పాలన అందించటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

ప్రభుత్వం చెప్పింది చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడటం ఉద్యోగులకు తగదని సూచించారు. పార్లమెంట్, అసెంబ్లీ చట్టాల్ని అవమానించేలా వ్యవహరించటం బాధాకరమన్నారు. అధికారులు, ఉద్యోగులు తమ వ్యవహారశైలిపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఇద్దరు తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాల పురస్కార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.