ETV Bharat / state

రాష్ట్రంలో హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: యనమల - corona cases in andhra pradesh

రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్​ చేశారు. ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సీఎం జగన్​ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

yanamala ramakrihsnudu
yanamala ramakrihsnudu
author img

By

Published : Apr 27, 2021, 12:28 PM IST

సీఎం జగన్ తన స్వార్థంతో రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుందని.. ఇప్పుడు ఆరోగ్య అత్యయిక స్థితి నెలకొందని ఆరోపించారు. కొవిడ్ రెండో దశ వల్ల పేదలు నిరుపేదలుగా, మధ్యతరగతి వాళ్లు పేదలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రంపై పోరాడే ధైర్యం సీఎం జగన్​కు లేదని దుయ్యబట్టారు. కరోనా రోగులకు అత్యవసర వైద్య చికిత్సపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి.. రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.