ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా చివరి శ్రావణ శుక్రవారం పూజలు

author img

By

Published : Sep 3, 2021, 3:05 PM IST

రాష్ట్రవ్యాప్తంగా చివరి శ్రావణ శుక్రవారం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలను, దేవతలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, వ్రతాలు, కుంకుమపూజలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

Worship on the last Shravan Friday across the state
రాష్ట్రవ్యాప్తంగా చివరి శ్రావణ శుక్రవారం పూజలు

నేడు శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల పూలతో ఆలయాలను అలంకరించారు. దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణలు చేసి విశేష పూజలు, వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు.

విశాఖ పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం లక్ష్మి పూజలను వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీగా హాజరై కుంకుమ పూజల్లో పాల్గొన్నారు.

అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలవిరాట్టును కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలను ఆలయంలో జరిపారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కోట దుర్గమ్మ ఆలయంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన త్రిపురంతాకంలోని బాల త్రిపుర సుందరి దేవి ఆలయాన్ని గాజులు, పూలతో అలంకరించారు. కుంకుమార్చన, అభిషేకాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగల్లు వండి నైవేద్యాలు సమర్పించారు.

ఇదీ చదవండి: RAMATHIRTHAM TRUST BOARD: రామతీర్థం ట్రస్టు బోర్డు నియామకానికి నోటిఫికేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.