కృష్ణాజిల్లా అవనిగడ్డ ఏరియా హాస్పిటల్ లో కనీసం ఆక్సిజన్ సదుపాయం లేక శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు క్షీణించడంతో అవనిగడ్డ ఆరో వార్డుకు చెందిన 65 సంవత్సరాల మహిళ మృతి చెందింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. 4 రోజుల క్రితం ఆక్సిజన్ నిల్వలు ఖాళీ కాగా... అప్పటినుంచి ఆసుత్రిలో ప్రాణవాయువు కొరత ఏర్పడింది. మృతురాలిని అవనిగడ్డ ఆసుపత్రి నుంచి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా.. వాహనం అందుబాటులో లేకపోవడం కూడా మరణానికి మరో కారణంగా తెలుస్తోంది.
అధికారులు, ప్రజా ప్రతినిధుల స్పందన..
ఆక్సిజన్ లేక మరణం నమోదుకావడంపై స్పందించిన అవనిగడ్డ నియోజకవర్గం శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబు సొంత ఖర్చుతో 10 ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించే ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో కోవిడ్ నోడల్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ కృష్ణాజిల్లా కలెక్టర్‌కు ఆక్సిజన్ ఏర్పాటు కోసం లేఖ రాశారు.
ఇవీ చదవండి:
కొవిడ్‌తో వ్యక్తి మృతి.. చివరి తంతు జరిపించిన పంచాయతీ సిబ్బంది