ETV Bharat / state

కొవిడ్​తో మహిళ మృతి... మృతదేహాన్ని వదిలి వెళ్లిన కుటుంబసభ్యులు! - nandigama government hospital latest news

కొవిడ్‌తో మరణించిన వారి మృతదేహాలను తాకేందుకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రాని ఘటనలు తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఉదంతమే కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోనూ జరిగింది.

Woman dies of covid
కొవిడ్​తో మహిళ మృతి
author img

By

Published : May 3, 2021, 3:10 PM IST

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కొనతాలపల్లికి చెందిన 55 సంవత్సరాల మార్తమ్మ అనే మహిళ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడింది. చికిత్స నిమిత్తం ఆమెను కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా మారింది. కరోనా పరీక్ష ఫలితం రాకముందే... వైద్యులు చికిత్స చేశారు. చికిత్స చేస్తుండగానే మార్తమ్మ మృతి చెందింది.

అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు వెనుకడుగు వేశారు. కరోనా పరీక్ష ఫలితం వచ్చిన తర్వాతనే మృతదేహాన్ని తీసుకువెళ్తామని చెప్పి అక్కడే వదిలివెళ్లిపోయారు. ఫలితంగా... ఆ మహిళ మృతదేహం ఆస్పత్రిలో మంచంపైనే ఉంది. అనంతరం.. మార్తమ్మకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. చివరికి ఆసుపత్రి సిబ్బందే మార్తమ్మ మృతదేహం తరలించే ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:

పాడేరులో కొవిడ్​తో చనిపోయింది.. పవన్ కల్యాణ్ బౌన్సరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.