'రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టండి' - latest news of amaravathi issue
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల తీర్మానాన్ని... ఏపీ మంత్రివర్గం ఆమోదించడంపై కమిటీ మండిపడింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని జగన్ ఎందుకు ఒప్పుకున్నారని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి ప్రశ్నించారు. 30 రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.