ETV Bharat / state

'చంద్రబాబు, లోకేశ్​కు కరోనా పరీక్షలు చేయిస్తాం'

వైకాపా ప్రభుత్వంపై మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబు, లోకేశ్​కు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. పోలవరానికి ఐదేళ్లలో ఎంత ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పగలరా అని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు.

minister anil kumar yadav
minister anil kumar yadav
author img

By

Published : May 28, 2020, 6:28 PM IST

మీడియాతో మంత్రి అనిల్​ కుమార్ యాదవ్

దేశంలో అత్యధిక కరోనా నిర్ధరణ పరీక్షలు చేసిన రాష్ట్రం ఏపీనేనని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షల విషయంలో చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి అనిల్ మండిపడ్డారు. రెండు నెలల నుంచి రాష్ట్రంలో లేని చంద్రబాబు.... ఇప్పుడు విమర్శలు చేయటమేంటని అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడికి కరోనా పరీక్షలు చేయిస్తామని మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ చెప్పారు.

ఎల్‌జీ పాలిమర్స్‌కు, జగన్‌కు ఒకే లాయర్ ఉండకూడదా అని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. లాయర్ మంచివారైతే ఎవరైనా పెట్టుకుంటారని... అందులో తప్పేముందని అన్నారు. ఈ విషయంలోనూ తెదేపా విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. పోలవరానికి ఐదేళ్లలో ఎంత ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పగలరా అని అనిల్‌ ప్రశ్నించారు. రాయలసీమకు నీరు ఇచ్చేందుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

విధ్వంసం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.