విజయవాడలో ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రతినిధుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ప్రధానంగా వర్గీకరణ అంశం, ఎస్సీ ఎస్టీ వర్గాలపై దాడులు, సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడంపై చర్చించి కార్యాచరణ రూపొందించామన్నారు.
వర్గీకరణకు కృషి చేయాలి..
ఎస్సీ వర్గీకరణకు సీఎం కృషి చేయాలని, సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించరాదని సూచించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎన్నో హక్కులను కాలరాశారు..
రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు ప్రసాదించిన ఎన్నో హక్కులను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ నుంచి 13 జిల్లాల్లో చైతన్య సదస్సులు నిర్వహించి ఛలో విజయవాడ కార్యక్రమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.