104 కాల్ సెంటర్‌కు నేడు సుమారు 17 వేల మంది ఫోన్ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ వెల్లడించారు. టెలీ సేవలను అందించేందుకు దాదాపుగా 3 వేలకుపైగా వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
నేటి నుంచి అంతటా ఆంక్షలు..
ప్రారంభంలో కేవలం వందమందితోనే టెలీ సేవలు ప్రారంభించామని సింఘాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత కరోనా తాకిడి దృష్ఠ్యా 104కు వచ్చే ప్రతి కాల్‌ను విశ్లేషిస్తున్నట్లు వివరించారు. నేటి నుంచి అన్ని చోట్లా కొవిడ్ ఆంక్షలు అమలుచేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: