కృష్ణా జిల్లా మోపిదేవి నుంచి అవనిగడ్డ వైపు వెళ్లే దారి ప్రక్కన సుమారు డెబ్బై కుటుంబాలకు ఒక్కటే కుళాయి కనెక్షన్ ఉంది. ఆ కుళాయిలో నీరు కేవలం గంట సేపు రావడంతో తాగేందుకు నీరు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగాయతిప్పకు వెళ్లే రోడ్డులో మంచినీటి ట్యాంకుకు ఎయిర్ వాల్ వద్ద వచ్చే నీటిని పైప్ తగిలించి సుమారు 20 కుటుంబాలు పట్టుకుంటున్నాయి. చేతి పంపు ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటన్నారు.
ఇదీ చూడండి:కాయకు 'పండు ఈగ'... రైతుకు నష్టాల క్షోభ