ETV Bharat / state

బిందె నీటి కోసం 15 కిలోమీటర్లు ప్రయాణం - 'గొంతెండి పోతుంది...గుక్కెడు నీళ్లివ్వండి'

తీవ్ర నీటి ఎద్దడితో కృష్ణా జిల్లా బసవవానిపాలెం గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి కోసం 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తమ నీటి కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు.

బిందె నీటి కోసం 15 కిలోమీటర్లు ప్రయాణం !

author img

By

Published : Jun 7, 2020, 2:23 PM IST

కృష్ణా జిల్లా కోడూరు మండలం బసవవానిపాలెంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. తాగునీరు లేక గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. గ్రామంలో 85 కుటుంబాలు ఉండగా...నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలో సముద్రం ఉన్నప్పటికి త్రాగడానికి నీరు మాత్రం లభించటం లేదు.

గ్రామంలో ఊట గుంతలు తీసుకొని అందులో వచ్చే నీటిని తాగుతున్నారు. అవి కూడా 15 రోజుల తర్వాత ఉప్పగా మారిపోతున్నాయని వాపోతున్నారు. కొన్నిచోట్ల చేతి పంపులు ఏర్పాటు చేసుకున్నా...సముద్రం దగ్గరగా ఉండటంతో ఉప్పునీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కావాలంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడూరుకు వెళ్లాల్సి వస్తుందని నిట్టూరుస్తున్నారు. తమ నీటి కష్టాల గురించి అధికారులకు ఎన్నిసార్లు మెురపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని...తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.