ETV Bharat / state

మద్యం దుకాణం వాచ్​మన్​ ఆత్మహత్య

మద్యం దుకాణంలో వాచ్ మన్ గా పని చేస్తున్న వ్యక్తి.. ఆత్మహత్య చేసుకున్నాడు. దుకాణంలో జరిగిన వాగ్వాదమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళనకు దిగారు.

watchman suicide in krishna district and his relatives protest near police station
పోలీస్​ స్టేషన్​ వద్ద ఆందోళన చేస్తున్న మృతుని బంధువులు
author img

By

Published : May 5, 2020, 1:13 PM IST

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణం వద్ద పనిచేసే వాచ్​మెన్​ కోటేశ్వరరావు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యంకి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ప్రభుత్వ మద్యం దుకాణంలో రాత్రి పూట వాచ్​మెన్​గా విధులు నిర్వహించేవాడు. లాక్​డౌన్​ తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోగా.. గత రాత్రి విధులకు వెళ్లాడు.

దుకాణంలో ఉన్న మిగిలిన ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం బయటకు తరలిస్తుండగా అడ్డుకున్నాడని కుటుంబీకులు తెలిపాారు. అక్కడ జరిగిన వాగ్వాదం కారణంగానే మనస్థాపానికి గురై కోటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగులపై కూచిపూడి పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కోటేశ్వరరావు మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.