Volunteer Suicide Attempt: వాలంటీర్ విధుల నుంచి తనను తొలగిస్తున్నారన్న మనస్థాపంతో.. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ వాలంటీర్ తమ్మిశెట్టి నాగగోపి ఆత్మహత్యకు యత్నించాడు. వాలంటీర్‌గా విధుల నుంచి తొలగిస్తున్నట్లు లెటర్ ఇచ్చిన క్రమంలోనే.. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. స్థానిక వైకాపా నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడని.. బాధితుడు వాట్సప్ మెసేజ్‌లో ఆరోపించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వాలంటీర్ గోపీని.. బంధువులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: MLA Amarnath: నిఘా సాఫ్ట్‌వేర్‌ను మా ప్రభుత్వం వాడుతోంది: గుడివాడ అమర్నాథ్