కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామం ప్రారంభంలో పంట కాలువ గట్టుపై యాభై ఏళ్లుగా.. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని కొంతమంది జీవనం సాగిస్తున్నారు. గతంలో కిరోసిన్ ఇచ్చినప్పుడు దీపాన్ని వెలిగించుకునేవారు. దానితో విషపురుగులు వచ్చేవి కావు. ప్రస్తుతం చౌక ధరల దుకాణాల ద్వారా కిరోసిన్ ఇవ్వకపోవడంతో వీరికి సమస్య వచ్చి పడింది. ప్రభుత్వం అందించే విద్యుత్ సౌకర్యం వీరి వరకు చేరలేదు. ప్రస్తుతం.. వర్షాలు ఎక్కువగా పడటం వలన ప్రతి రోజు రాత్రి సమయంలో పదుల సంఖ్యలో పాములు గుడిసెల్లోకి వస్తున్నాయి. గట్టుపై నివసించే వారంతా.. ప్రాణ భయంతో పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి నిద్రపోతున్నారు. రోడ్డుపై వెళ్లే వాహనాలతో ప్రమాదం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. తమ గుడిసెల దగ్గర వీధి లైట్లు అయినా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి