కృష్ణా జిల్లా.. విజయవాడ గ్రామీణం నున్న గ్రామంలో గ్రామ వాలంటీర్ మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కాడు. గ్రామానికి చెందిన జ్యోష్న కుమార్ టాటా ఏస్ వాహనంలో అర్ధరాత్రి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం రావటంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాలంటీర్‌ను అరెస్టు చేసి.. 190 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
వాలంటీర్‌గా పనిచేస్తూ అక్రమంగా మద్యం తరలిస్తోన్న యువకుణ్ని విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామని పంచాయతీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి..