ETV Bharat / state

గణేశ్ ఉత్సవాలకు అనుమతి లేదు: విజయవాడ సీపీ - vijayawada latest news

కరోనా కేసుల దృష్ట్యా విజయవాడ నగరంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ తెలిపారు. ఎవరి ఇళ్లల్లో వారే పూజలు చేసుకోవాలని సూచించారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు.

vijayawada cp announced to no permission for vinayaka chavithi celebrations
వివరాలు వెల్లడిస్తున్న విజయవాడ సీపీ
author img

By

Published : Aug 20, 2020, 6:10 PM IST

Updated : Aug 20, 2020, 9:31 PM IST

విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా... వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి లేదని నగర సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. తమ తమ ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఊరేగింపులు, నిమజ్జనాలు చేసుకోవడానికి అనుమతి లేదన్న సీపీ... ఆలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హత్యాయత్నం కేసులో సిబ్బందిపై చర్యలు

నగరంలో సంచలనం రేపిన సజీవదహనం యత్నం కేసులో పోలీసు సిబ్బందిపై సీపీ చర్యలు తీసుకున్నారు. నిందితులకు పోలీసు సిబ్బంది సహాయం చేశారనే ఆరోపణలు రావడంతో ఓ కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేశారు. ఐదుగురు పోలీసులకు ఛార్జ్​ మెమోలు ఇచ్చినట్లు సీపీ తెలిపారు. ఇటీవల నగరంలో నోవాటెల్ సమీపంలో నిందితుడు వేణుగోపాలరెడ్డి.. ముగ్గురు వ్యక్తులపై పెట్రోలు పోసి చంపేందుకు యత్నించారు.

2016లో 77 ఏళ్ల వృద్ధురాలిపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుడైన కోటేశ్వరరావుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో బాగా పనిచేసిన సిబ్బందికి రివార్డులు అందిస్తామని అన్నారు. కారు దహనం కేసులో ఐదుగురు పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని...ఇప్పటికే చాలా మందిని విచారించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిండమే లక్ష్యం'

Last Updated : Aug 20, 2020, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.