వరద ప్రాంతాల్లోని గ్రామాలకు నిత్యవసరాల సరాఫరాలో జాప్యం ఉండకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కృష్ణా పరివాహక ముంపు ప్రాంతాల పరిస్థితిపై సంయుక్త కలెక్టర్ మాధవీలత, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ చేశారు. బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల నిర్వహణలో అధికారుల పని తీరును అభినందించారు. వరద గ్రామాల్లోని కుటుంబాలకు బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ కిలో చొప్పున పంపిణీ చేయాలని ఆదేశించారు. లంక ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందిచాలని సూచించారు.
ఇవీ చదవండి...