కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామంలో... ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ కంపెనీల నిత్యావసర వస్తువులను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.6లక్షలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ సరకులు ఎక్కడినుంచి వచ్చాయనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని... విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: మందుబాబు లొల్లి... కానిస్టేబుల్ జాలి