ETV Bharat / state

'పగ వారికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు' - విజయవాడ కరోనా వార్తలు

అనారోగ్యానికి గురైన తన భర్తకు చికిత్స అందించాలంటూ ఓ మహిళ విజయవాడలోని చాలా ఆసుపత్రులకు తిరిగింది. గంటపాటు అంబులెన్స్​లో ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసింది. తన భర్తకు కరోనా లేదన్న రిపోర్ట్​ను చూపించింది. అయినా ఏ ఒక్క ఆసుపత్రి కనికరం చూపలేదు. విషయం కలెక్టర్ దృష్టికి చేరటంతో అతనికి చికిత్స అందుతోంది.

video taken by the patient's wife in vijayawada went viral

author img

By

Published : Jul 30, 2020, 6:58 PM IST

బాధితుడి భార్య ఆవేదన
అతనికి కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కానీ శ్వాస సంబంధ సమస్యతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాధితున్ని స్థానిక ఆసుపత్రికి వెళ్తే మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే... వైద్యులు చేర్చుకునేందుకు విముఖత చూపారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన ఆమె... తన చరవాణితో పరిస్థితిని వివరిస్తూ వీడియో చిత్రీకరించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారటంతో జిల్లా కలెక్టరు స్పందించి అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జిరిగింది.

నూజివీడు పౌర సంబంధ శాఖలో విధులు నిర్వహిస్తున్న శౌరి ప్రసాద్​కు శ్వాస తీసుకోవటంతో ఇబ్బంది తలెత్తింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అత్యవసర వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అతనికి ఆక్సిజన్​ సిలిండర్​​ సాయంతో శ్వాస అందిస్తూ అంబులెన్స్​లో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రులు చుట్టూ అతని భార్య ప్రదక్షిణ చేసింది. అయినా వారు చికిత్స అందించేందుకు నిరాకరించారు. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన రిపోర్ట్ చూపినా వైద్యం అందించేందుకు విముఖత చూపించారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ బాధితుని భార్య ఓ సెల్ఫీ వీడియోలో పరిస్థితిని వివరించింది. ఇలాంటి పరిస్థితి పగ వారికి కూడా రాకూడదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారటంతో నూజివీడు తహశీల్దారు, ఆర్డివో స్పందించి జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే వైద్యాధికారులతో మాట్లాడారు. అత్యవసర వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతం బాధితుడు ప్రసాద్​కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి

'గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.