జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థులకు రెండో విడత చెల్లింపులను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. రెండో విడతను ఆగస్టులో ఇవ్వాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించినా..విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాకే సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తొలివిడత కింద 11.87 లక్షల మంది విద్యార్థులకు సాయం అందించారు. ఇకపై ఈ డబ్బును తల్లుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా 9,21,411 మంది ఖాతా వివరాలు సేకరించారు.
ఇదీ చూడండి. సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు క్షేమం