ETV Bharat / state

'రాష్ట్రానికి చంద్రబాబు ప్రవాస నేతగా మారారు' - ysrcp mla vasantha krishna prasad news

కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్​కు సంబంధించి దేవినేని ఉమ విసిరిన సవాల్​కు తాను సిద్ధమని అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు.

VasanthaKrishnaPrasad
VasanthaKrishnaPrasad
author img

By

Published : Sep 3, 2020, 3:41 PM IST

రాష్ట్రానికి చంద్రబాబు ప్రవాస నేతగా మారారని వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్​లో ఉన్న చంద్రబాబు... జైలుకి వెళ్లొచ్చిన తెదేపా నేతలను పరామర్శించేందుకు మాత్రం రాష్ట్రానికి వచ్చారని విమర్శించారు.

మరోవైపు కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్​కు సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమ తనపై చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని కృష్ణప్రసాద్ చెప్పారు. తెదేపా హయాంలో జరిగిన అవినీతిపై దేవినేని ఉమ సీబీఐ విచారణకు సిద్ధమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జగ్గీవాసు దేవన్​కు 400 ఎకరాల అటవీ భూమి ఇవ్వాలని తెదేపా నేతలు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.

ఇదీ చదవండి

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.