ETV Bharat / state

వ్యాక్సిన్‌ ఎఫెక్ట్.. కోటపాడు అంగన్‌వాడీ కార్యకర్తకు తీవ్ర అస్వస్థ.. - Vaccine Effect Severe Illness for Kotapadu Anganwadi

కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన అంగన్​వాడీ కార్యకర్త కోట విజయలలిత ఈనెల 21వ తేదీన కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. ఆ రోజు నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Vaccine Effect .. Severe Illness for Kotapadu Anganwadi Worker
వ్యాక్సిన్‌ ఎఫెక్ట్.. కోటపాడు అంగన్‌వాడి కార్యకర్తకు తీవ్ర అస్వస్థ..!
author img

By

Published : Jan 31, 2021, 9:43 AM IST

కృష్ణాజిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన అంగన్​వాడీ కార్యకర్త కోట విజయలలిత ఈనెల 21వ తేదీన కరోనా వ్యాక్సిన్ తీసుకుంది. తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి తల తిరగడం, జ్వరం, కాళ్లు లాగడం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.

ఈనెల 24వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ నెల 27వ తేదీన డిచ్ఛార్జ్ అయినట్లు బాధితురాలు విజయలలిత తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని బాధితురాలు అన్నారు. తన భర్త గతంలోనే మరణించాడని.. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి తనకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. తన కుమార్తెలకు ప్రభుత్వం అండగా నిలవాలని బాధితురాలు వేడుకుంటోంది.

ఇదీ చదవండి: అపహరణకు గురైన సర్పంచ్​ అభ్యర్థి క్షేమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.