రెండో విడత కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాల మేరకు... మైలవరం హనిమిరెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు టోకెన్లు అందజేసి రద్దీ తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మే 13 న ప్రారంభించే ఈ కేంద్రంలో తొలుత సెకండ్ డోస్ అందుబాటులో ఉంటుందని వివరించారు. గ్రామ సచివాలయ సెక్రెటరీ, విఆర్వోల పర్యవేక్షణలో వాలంటీర్ల ద్వారా టోకెన్లు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: