ETV Bharat / state

వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం! - వ్యాక్సినేషన్ కార్యక్రమం వివాదస్పదం

కృష్ణా జిల్లా కంకిపాడు వాణీనగర్‌లోని నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Vaccination camp at YCP office
Vaccination camp at YCP office
author img

By

Published : May 10, 2021, 9:28 AM IST

కృష్ణా జిల్లా కంకిపాడు వాణీనగర్‌లోని నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో టీకా శిబిరం నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచే కంకిపాడు, పునాదిపాడు, నెప్పల్లి, తెన్నేరు, ఉప్పలూరు, ఈడుపుగల్లు, గొడవర్రు, కుందేరు, ప్రొద్దుటూరు గ్రామాలకు చెందిన అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు వాహనాల్లో కార్యాలయానికి తరలివచ్చారు.

టీకా విషయాన్ని గోప్యంగా ఉంచడంతో వీరు ఎందుకు వస్తున్నారో ఇతరులకు తెలియలేదు. పార్టీలో అధిక పలుకుబడి కలిగిన వారికే ముందుగా టీకాలు వేసి పంపారు. చిన్న నాయకులు, కార్యకర్తలకు చివరి క్షణంలో వ్యాక్సిన్‌ వేశారని చెబుతున్నారు. దీనిపై సంబంధిత రెవెన్యూ, వైద్యాధికారులను వివరణ కోరగా ‘అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. మా శాఖల అధికారులు, సిబ్బందికి సంబంధం లేదు’ అని చెప్పారు.

ఇదీ చదవండి

వేధిస్తోన్న ఆక్సిజన్ కొరత..నూతన ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.