ETV Bharat / state

పట్టణాల్లో మురుగు తటాకాలుగా మారుతున్న ఖాళీ స్థలాలు - మురుగు, పిచ్చి చెట్ల చేరికతో స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్న ఖాళీ స్థలాలు

పట్టణాలు విస్తరిస్తున్నాయి.. అన్ని ప్రాంతాల్లోనూ జనావాసాలు పెరుగుతున్నాయి. పిల్లల చదువులు, వృత్తి.. ఇలా వివిధ అవసరాల నిమిత్తం గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వస్తున్నారు. దీంతో చాలామంది నివాస స్థలాలూ కొనుగోలు చేసుకుంటున్నారు. వాటిలో కొందరు ఇళ్లు నిర్మించుకుంటుంటే.. చాలామంది ఖాళీగా వదిలేస్తున్నారు. ఆయా పట్టణాల్లోని వేల ఖాళీస్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో.. అవన్నీ మురుగునీరు, ముళ్లపొదలతో నిండిపోతున్నాయి. వాటి నుంచి వచ్చే దుర్వాసన, దోమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో సమస్యలతోనే సహజీవనం చేయాల్సిన దుస్థితి నెలకొంది.

empty places creating problems in cities
పట్టణాల్లో సమస్యలు సృష్టిస్తున్న ఖాళీ స్థలాలు
author img

By

Published : Jan 24, 2021, 7:57 PM IST

మచిలీపట్నంలోని 50 డివిజన్‌ పరిధిలో 2 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పట్టణంలోని అనేక చోట్ల ఖాళీ స్థలాలూ అధికంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో స్థలాలు కొని ఖాళీగా వదిలేశారు. వలందపాలెం, మాచవరం, పరాసుపేట, భాస్కరపురం, బ్రహ్మపురం, ఈడేపల్లి, ఆర్టీసీ కాలనీ, గొడుగుపేట, రాజుపేటల్లోని ఖాళీ స్థలాల్లో మురుగునీరు చేరి తటాకాలు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల పిచ్చిమొక్కలు మొలిచి చిట్టడవుల్లా తయారయ్యాయి. పలు చోట్ల జనావాసాల మధ్యలోనే ఇవి ఉండటంతో.. దోమలు, పందులతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. సమస్య తీవ్రతపై గట్టిగా ప్రశ్నిస్తే స్థల యజమానులకు నోటీసులు జారీ చేయడం.. తరువాత వదిలేయడం అధికారులకు పరిపాటిగా మారింది.

అన్ని చోట్లా అంతే...

ఒక్క మచిలీపట్నంలోనే కాక పెడన, తిరువూరు, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, నందిగామ ఇలా అన్ని పురపాలక సంఘాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం వస్తే చాలు ఈ ఖాళీస్థలాల్లో నీరుచేరి తటాకాలుగా మారిపోతున్నాయి. వర్షాకాలంలో వీటి వల్ల సమస్య తీవ్రంగా ఉంటుంది. కొన్ని సార్లు మోటారు ఇంజన్‌లు ఏర్పాటు చేసి.. నీటిని బయటకు తోడించాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

  • పెడనలోని కొత్తపేట, బ్రహ్మపురం, వీరభద్రపురం ఇలా అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి.
  • తిరువూరులో.. కట్టిన ఇళ్ల కంటే ఖాళీస్థలాలే ఎక్కువ ఉంటాయంటే అక్కడ తీరు మరీ దారుణం అని తెలుస్తోంది. తిరువూరు రాజుపేట, నందింతిరువూరు, శాంతినగర్‌, అశోక్‌నగర్​లోనూ ఇవే ఇబ్బందులతో ప్రజలు సతమతమవుతున్నారు.
  • జగ్గయ్యపేట మున్సిపాలిటీలోని కాకానీనగర్‌, డాంగీ నగర్‌, శాంతీనగర్‌ ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఖాళీ స్థలాలు ఉన్నాయి.
  • నూజివీడులోని బంగినపల్లితోట, ఎం.ఆర్‌ అప్పారావు కాలనీతోపాటు పలు వార్డుల్లో.. దశాబ్దాలుగా ఎంతోమంది తమ స్థలాలను ఖాళీగా వదిలేశారు. ఎంప్లాయీస్‌ కాలనీలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
  • గుడివాడ పట్టణం పరిధిలోని రాజేంద్ర నగర్‌, ఆర్టీసీ కాలనీల్లో సుమారు 30 నుంచి 35 వరకు ఖాళీ స్థలాలు కొన్నేళ్లుగా పిచ్చిచెట్లు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఆదాయం పోతున్నా పట్టించుకోరే?

పురపాలకసంఘాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో.. ఖాళీస్థలాల నుంచి పన్నులు వసూలు చేయడం అధికారుల బాధ్యత. ప్రతి ఆరునెలలకు ఓసారి ఖాళీస్థలం అసలు విలువ మీద 0.2 శాతం పన్నురూపంలో కట్టించుకోవాలి. కానీ ఆదిశగా ఏ పట్టణంలోనూ అధికారులు చొరవ చూపడం లేదు. మచిలీపట్నంలో 2,500కు పైగా ఖాళీస్థలాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. గుర్తించిన వాటికైనా పూర్తిస్థాయిలో పన్నులు కట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం 1,600 మంది నుంచి మాత్రమే పన్నులు కట్టించుకుంటున్నట్లు అధికారులే చెబుతున్నారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటని అడిగితే.. యజమానుల చిరునామాలు తెలియలేదని పేర్కొంటున్నారు. ఇలా వందల సంఖ్యలో ఖాళీస్థలాల గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో పురపాలకసంఘాలకు రావాల్సిన ఆదాయమూ కోల్పోవాల్సి వస్తోంది. అధికారులు ఇప్పటికైనా ఆ దిశగా దృష్టిసారిస్తే.. ఖాళీ స్థలాల సమస్యలు పరిష్కారం కావడంతో పాటు.. పురపాలక సంఘాలకూ ఆదాయం వస్తుంది.

ఖాళీస్థలాలపై ప్రత్యేకదృష్టి:

బందరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సిబ్బందితో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో స్థలాలను ఖాళీగా వదిలేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. పలు ప్రాంతాల్లో స్థల యజమానుల చిరునామాలు తెలియక కొంత సమస్య ఏర్పడుతుంది. అందుకే వాటి సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వివరాలు తీసుకుంటున్నాం. వాటి కారణంగా పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకూడదు. అందుకే అలాంటి వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నాం. వాటికీ స్పందించక పోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. - శివరామకృష్ణ, మచిలీపట్నం నగరపాలకసంస్థ కమిషనర్‌.

ఇదీ చదవండి: నిత్యావసరం.. మూడు నెలల్లో ధరా ఘాతం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.